
ఈ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే తనను రేప్ చేశావని చెప్తానని వార్నింగ్ ఇచ్చింది.ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల యువతి లైంగికదాడికి పాల్పడింది.సదరు యువతి తన ఇంటి పక్కనే ఉన్న బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని నిత్యం తన ఇంట్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. దీంతో ఆ బాలుడు భయంతో కొన్నాళ్లపాటు ఎవరికీ చెప్పలేదు. ఈ క్రమంలో శృతి మించి అసభ్యకర పనులు చేయాలని యువతి ఒత్తిడి చేయడంతో వేధింపులను తట్టుకోలేక అతడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించ డంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.కాగా బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.