
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం వేళ హైదరాబాద్ షాక్ కు గురైన వార్త హల్ చల్ చేసింది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయంలో బాంబులు పెట్టామని ఆగంతకులు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర అధికారులు ఎయిర్ పోర్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు సరిహద్దులో యుద్ధం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో బలగాలను పూర్తిస్థాయిలో మోహరించారు. 24 గంటల పాటు పూర్తి పర్యవేక్షణతో విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్ బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. ఎయిర్ పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.