
మీ గురించి ఇతరులు ఏం అనుకుంటారో అని ఆలోచిస్తున్నంత కాలం జీవితంలో ఆనందం అనేది ఉండదు. కాబట్టి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరోలా ఉండడం మానుకోవాలి. మీకు నచ్చినట్టుగా మీరు ఉండడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. అలాగే మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుంది. వారి దగ్గర ఉన్నది మీకు లేదన్న బాధ కలుగుతుంది. ఉన్న సంతోషం మాయమవుతుంది.
విలాసవంతమైన జీవితం గడపాలంటే డబ్బు అవసరమే. కానీ సంతోషంగా ఉండటానికి అవసరంలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన కొద్ది క్షణాలే మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. కాబట్టి మీ ప్రాధాన్యతలను మార్చుకోవాలి.మీకు శ్రమ అధికమవుతుంది తప్ప సంతోషం కనిపించదు. వంద పనులు ఒకేసారి చేసేబదులు ఏదో ఒక పనిని వందశాతం నిబద్ధతతో చేస్తే ఆనందం లభిస్తుంది. ఇష్టంగా ఆస్వాదిస్తూ చేసే పని మాత్రమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.లైఫ్ని ఫుల్గా ఎక్స్పీరియెన్స్ చేయాలంటే గతాన్ని, భవిష్యత్తును తలుచుకుని బాధపడటం మానుకోవాలి. మన చేతుల్లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే మార్గం ఆలోచించాలి