

ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడిన జీడిమెట్ల పోలీసులు,
రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా శబ్దం రావడంతో సెకండ్ల వ్యవధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం మల్లేష్ మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న
ఇద్దరు యువకుల్ని ఆటోలో దగ్గర్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల ఇద్దరు ప్రాణాలు కాపాడడం జరిగింది.ఆ ఇద్దరు విద్యార్థులు బైక్ పైన టెంపుల్ కు వెళ్తున్నట్లుగా RTC bus ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ యొక్క యువకుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు హాస్పిటల్ కు చేరుకున్నారు .గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరడం జరిగింది.