

- చివరి నిమిషంలో ఓపెన్ కోర్టు విచారణను రద్దు
- తనకు జలుబు చేసిందని కమిషన్కు చెప్పిన కేసీఆర్
- 50 నిముషాల పాటు కొనసాగిన విచారణ
కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) హాజరయ్యారు. అయితే కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో ఓపెన్ కోర్టు విచారణను రద్దు చేసింది కమిషన్. తనకు జలుబు చేసిందని కమిషన్కు కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు జలుబు అనారోగ్యం నేపథ్యంలో బహిరంగ విచారణను కమిషన్ రద్దు చేసింది. ఇండోర్లో మాజీ సీఎంను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముఖాముఖిగా విచారణ విచారిస్తున్నారు. కమిషన్ కోర్ట్ గదిలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్, కేసీఆర్తో పాటు కమిషన్ సెక్రటరీ మురళీధర్ రావు ఉన్నారు. స్టెనోగ్రాఫర్, నోడల్ అధికారిని కూడా కమిషన్ బయటికి పంపించేసింది.
కాగా.. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఈరోజు ఉదయం (బుధవారం) సిద్దిపేట ఫాం హౌస్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు కేసీఆర్. అక్కడి నుంచి నేరుగా బీఆర్కే భవన్కు వెళ్లి కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఓపెన్ కోర్టుకు తొమ్మిది మంది బీఆర్ఎస్ నేతలకు కమిషన్ అనుమతినిచ్చింది. దీంతో మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంపీ రవిచంద్ర, తదితరులు కేసీఆర్ వెంట బీఆర్కే భవన్కు చేరుకున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఓపెన్ కోర్టు నుంచి మీడియా ప్రతినిధులను కూడా సిబ్బంది బయటకు పంపించి వేసింది.
అయితే కాళేశ్వరం కమిషన్ ఇప్పటి వరకు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా 114 మంది అధికారులు, ఇంజీనీర్లను ఓపెన్ కోర్టులో విచారించిన విషయం తెలిసిందే. ఇక కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరిందనే చెప్పుకోవచ్చు. కేసీఆర్ విచారణ అనంతరం తుది నివేదికను సిద్ధం చేసి ఈనెలాఖరున లేదా జూలైలో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.