
సంగారెడ్డి(ఇస్నాపూర్) : సంగారెడ్డి పాశ మైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది.సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి.స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది.దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఘటనా స్థలానికి భారీగా అంబులెన్సులు, 108 సిబ్బంది చేరుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో కంపెనీ దగ్గరకు చేరుకుంటున్నారు.తీవ్రగాయాలైన వారికి పటాన్చెరులో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.పేలుడు దాటికి భవనం కుప్పకూలిపోయింది.పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీ పరిసరాలు, చుట్టుపక్కల వారిని వెంటనే అక్కడ్నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.ఈ కంపెనీలో మెడిసిన్స్ కి సంబంధించిన పౌడర్ తయారు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఘటనలో 20మందికి పైగా కార్మికులకు తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది.ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమైనట్టుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ లోపల చిక్కుకున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
