
రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.రళను మే 27న తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ వేగం ఆధారంగా.. జూన్ మొదటి వారంలో, అంటే దాదాపు 5వ తేదీలోపే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందే తొలకరి పలకరించనుంది. ఏరువాకకు ముందే సన్నద్ధం కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ అంచనాల కంటే ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.