
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పాకిస్తాన్ చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న త్రివిధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు మోదీ సెల్యూట్ చేశారు. భారత దళాలు చూపిస్తున్న శౌర్యం, ధైర్యం, పరాక్రమం.. దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి కుమార్తెకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రమూకల స్థావరాలను కూల్చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే.. ఆ తర్వాత ఏం చేయాలో భారత్కు తెలుసని పేర్కొన్నారు. భవిష్యత్లో పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేదానిపై ఒక కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు….పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు చేసిన దాడితో ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలపై ప్రశంసలు గుప్పించిన ప్రధాని మోదీ.. పాక్ అణుబెదిరింపులను ఉపేక్షించేది లేదని వెల్లడించారు.