
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎన్ క్లేవ్ లో ఆర్.ఎన్.సి హాస్పిటల్ డాక్టర్ రమేష్ సౌజన్యంతో తేళ్ల హరికృష్ణ, దాసరి రాహుల్ ప్రదీప్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వడ్డేపల్లి ఎన్ క్లేవ్ కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్, పీఎస్ఆర్కే భగవాన్, కిషోర్ కుమార్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా తేళ్ల హరికృష్ణ మాట్లాడుతూ.. రోజువారి జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిని నివారించేందుకు తమ వంతు కృషిగా తెల్ల హరికృష్ణ, దాసరి రాహుల్ ప్రదీప్ మిత్ర మండలి గత ఆరు నెలలుగా హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ డివిజన్లో పలుచోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్, హై టెస్టింగ్ క్యాంప్, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది ఐదవ క్యాంప్ నిర్వహిస్తున్న వైద్య శిబిరమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, జీఆర్బీఎస్, సీబీపీ, ఈసీజీ పరీక్షలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత మందులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మందికి పైగా కాలనీవాసులు పాల్గొని వైద్య సేవలను ఉపయోగించుకున్నారని తెలియజేశారు, కార్యక్రమంలో పాల్గొన్న హాస్పిటల్స్ సిబ్బందికి డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



