
ఈరోజు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 276 పరీక్ష కేంద్రాలను సిద్దం చేయగా.. 1,06,716 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు.HB బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ ,హాల్ టికెట్‌పై ఫోటో లేకపోతే, విద్యార్థులు తప్పనిసరిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.ప.అలానే సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోకి అనుమతించబడవు.ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 3సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమాలల్లో అడ్మిషన్స్ భర్తీ చేయనున్నారు.