
సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రభుత్వం చివరి దాక ఉంటుందా అని ప్రజల్లో చర్చ మొదలైందని బండి సంజయ్ కుమార్ చెప్పారు.