
నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ (ACB) అధికారులు.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గురువారం తెల్లవారుజామున చంచల్గూడా జైలుకు తరలించారు.
కాగా ఆయన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. వందల కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది.హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో 13 చోట్ల బుధవారం ఉదయం ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. కరీంనగర్లో శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు.బెంగళూరులో నాలుగు చోట్ల, హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన గాయత్రి పంప్‌హౌస్ బాధ్యతలను శ్రీధర్ చూసేవారని,
అక్కడ ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో ఆయన కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.