
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ పేలుడులో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 7-05-2025 న కూంబింగ్ కోసం పోలీసులు వెళ్లగా గురువారం తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించింది. తెలంగాణకు చెందిన ముగ్గురు గ్రౌహౌండ్స్ పోలీసులు అక్కడికిక్కడే మృతి చెందారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన సందీప్, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన పవన్ కళ్యాణ్, కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్ ఐఈడీ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. శ్రీధర్‌కు తొమ్మిది నెలల క్రితమే శ్రీవాణితో వివాహం జరిగింది. మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితమే శ్రీధర్ ఉద్యోగంలో చేరాడు.