
దినచర్య ప్రారంభించగానే తీసుకునే మొదటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది.
ఇది తెలియక చాలామంది ఆరోగ్యానికి మంచి చేసేవే అనుకుని ఇవే బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ తినేస్తున్నారు.
కానీ, ప్యాన్ కేకులు,పండ్ల రసం,పెరుగు,ప్రోటీన్ బార్ అల్పాహారంలో ఖచ్చితంగా తినకూడని పదార్థాలు.
సమయం లేకపోవడం వల్ల చాలా మంది అల్పాహారంగా ప్రోటీన్ బార్లను తినడానికి ఇష్టపడతారు.
కానీ మీరు దానిని తినడం మానుకోవాలి. ఈ ప్రోటీన్ బార్లలో తగినంత ప్రోటీన్ ఉండకపోగా చక్కెర అధికంగా ఉంటుంది.
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఉదయం లేవగానే తీపి పండ్ల రసం తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
వీటిలో ఫైబర్ కూడా ఉండదు. పండ్ల రసానికి బదులుగా మీరు నిమ్మకాయ నీరు లేదా దోసకాయ రసం తాగవచ్చు.
వేఫెల్స్, ప్యాన్ కేకులు నిజానికి ఒక గొప్ప అల్పాహార ఎంపిక. వీటిని సాధారణంగా శుద్ధి చేసిన తెల్ల పిండితో తయారు చేస్తారు.
కానీ, ఇన్స్టంట్ ఫుడ్ అయితే మాత్రం ఇందులో చక్కెర సిరప్, వెన్న కలుపుతారు. కాబట్టి, ఇది అస్సలు ఆరోగ్యకరమైనది కాదు.
పెరుగులో ప్రోటీన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. కానీ వాటిని అల్పాహారంలో తీసుకోకూడదు.
ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే పెరుగు తినడం మంచిది కాదు. ఇది శరీరంలో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతారు.