
అందరికీ నమస్కారం. నేను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుం టున్నా. నా దేశానికి టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇంతకాలం నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇకపై నేను వన్డే ఫార్మాట్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను అని రోహిత్ వెల్లడించాడు.
టీమిండియా సారధి రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌ను వీడిన రోహిత్.. టెస్టులు, వన్డేల్లో ఆడుతు న్నాడు. ఇప్పుడు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటిం చిన హిట్ మ్యాన్.. కేవలం వన్డేలు మాత్రమే ఆడతానని ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించాడు.
8-ఏళ్ల రోహిత్ తన టెస్టు కెరీర్లో 67 మ్యాచులు ఆడి, 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. వీటిలో 12 శతకాలు, 18 అర్థశతకాలు ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, అంతకుముందు స్వదేశంలో న్యూజిల్యాండ్‌తో ఆడిన టెస్టు సిరీసుల్లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ రిటైర్మెంట్ ఇంగ్లండ్‌లో టీమిండియా కొత్త కెప్టెన్‌తో బరిలో దిగనుంది.