

ఉగ్రవాదాన్ని ఎలాంటి రూపంలోనూ సహించమని ప్రధాని మోదీ మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను ప్రశంసించారు.ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన భద్రతా దళాలపై మోదీ ప్రశంసలు గుప్పించారు. భేటీలో తొలుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ జరిగిన తీరును మంత్రులకు వివరించారు.మంత్రులు బల్లపై చరుస్తూ తమ అభినందనలు తెలిపారు.మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రధాని మోదీ యూరప్ పర్యటన రద్దయింది. ఈనెల మధ్యలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది.