
ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసింది.భారత్-పాకిస్థాన్ యుద్ధం అంతకంతకూ ముదురుతుండటంతో ఐపీఎల్-2025ను కొనసాగిస్తారా.. లేదా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. భద్రతా కారణాల రీత్యా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసింది బీసీసీఐ. దీంతో పూర్తి సీజన్‌ను నిలిపివేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి అందుకు తగ్గట్లే ఇవాళ మీటింగ్ తర్వాత ఐపీఎల్-2025ను నిరవధికంగా వాయిదా వేసింది. మిగతా మ్యాచులు జరుగుతాయా.. లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పడంతో ఇక ఈ సీజన్ క్లోజ్ అయినట్లేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.