

నిజామాబాద్ : కేంద్ర మంత్రి అమిత్ ఈరోజు నిజామాబాద్ సమావేశంలో పాల్గొన్నారు ఏళ్లుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డును కేంద్రమంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. పసుపు బోర్డు ఇక్కడికి రావడంలో రాష్ట్ర బీజేపీ ఎంపీల కృషి చాలా ఉందన్నారు. నిజామాబాద్ పసుపు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తుందని, పసుపు ధర పెరుగుతుందని, వ్యాపారాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. మార్కెటింగ్, ఎక్స్పోర్ట్స్ ఆఫీస్ కూడా నిజామాబాద్లో ఉంటాయని, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.
