

ప్రతినిత్యం భాగవతం, భగవద్గీత బోధిస్తూ కోట్లాదిమంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ ముందిరాలు నిలుస్తున్నాయి.
నిరంతరం హరే రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మహా ధాంధిక భక్తి సంస్థ ఇస్కాన్. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ISKCON). తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం.
కృష్ణ తత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్.ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు.పాశ్చాతులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్.

కృష్ణుడి గురించి హరే కృష్ణ నామం గురించి కృష్ణుడు చెప్పిన విధానంలో డుచుకుంటూ ఉంటే మన జీవన విధానంలో కలిగే మార్పులు కృష్ణ తత్వం గురించి నిత్యం ప్రపంచవ్యాప్తంగా 1966 ఈ సంస్థ సేవలు చేస్తోంది.బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, అబిడ్స్, సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది.
హరే కృష్ణ.. హరే రామ భజనలు, నృత్యాలతో భక్తులు పారవశ్యం చెందారు.శ్రీకృష్ణ పరమాత్ముడి నామస్మరణతో నగరం పులకరించింది. జగన్నాథ రథయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మికతను ద్విగుణీకృతం చేసింది.


