

DGCA ఆదేశాలతో ఆందోళనలో బేగంపేట్ ప్రజలున్నారు. తమకూ రిస్క్ ఉన్నట్లే అని భయపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పడ్డాక బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు కాస్త విమానాలు తగ్గినా సిటీకి వచ్చే వీఐపీలు, సీఎంలు, కేంద్రమంత్రుల రాకపోకలు మాత్రం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచే సాగిస్తున్నారు.దీనికి తోడు ఐఏఎఫ్ ట్రైనింగ్ విమానాలు, హెలికాప్టర్ల సర్వీసులు బేగంపేట్‌లో ఎక్కువ నడుస్తున్నా్యి.చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఎయిర్‌పోర్టును దుండిగల్‌కు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బేగంపేట్ వాసులు.