
The Telangana State Secretariat building is pictured with its lights switched on before the Earth Hour environmental campaign in Hyderabad on March 23, 2024. (Photo by NOAH SEELAM / AFP) (Photo by NOAH SEELAM/AFP via Getty Images)
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తమది ప్రజా ప్రభుత్వమని..
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రకటించారు.
తాజాగా తెలంగాణ సచివాలయంలో కొత్త రూల్స్ అమలు చేస్తున్నారట.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సెక్రటేరియట్‌లోకి వచ్చిన రోజు.. సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిస్తున్నాయి.
ఇక తాజాగా నిన్న అనగా మంగళవారం మధ్యాహ్నం.. సీఎం రేవంత్ సచివాలయంలోకి వచ్చారు.
ఈ సందర్భంగా విజిటర్స్ అవర్స్‌లో పాసులు తీసుకుని.. లోపలికి వచ్చే వారిని అడ్డుకున్నారు.
అదేమని ప్రశ్నిస్తే.. ఈరోజు సీఎం సార్ సెక్రటేరియట్లో ఉన్నారు. ఎవరికి అనుమతి లేదని అడ్డుకోవడే కాక వారిని వెనక్కి పంపించారు.
దీనితో వేర్వేరు పనుల కోసం సెక్రటేరియట్‌కు వచ్చిన విజిటర్స్ వెనక్కి వెళ్లిపొయారు.ఈ ఆంక్షలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లేని విజిటర్ అవర్స్ ఇప్పుడు పెట్టడం మంచిదే అయినప్పటికీ ఆంక్షలు విమర్శలకు దారితీస్తున్నాయి.
మరి దీనిపై సచివాలయ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి అంటున్నారు.