
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్నారు.
ఉదయం 8.30కి అహ్మదాబాద్ వచ్చిన ఆయన.. వెంటనే..
విమానం కూలిన మేఘనీనగర్‌లోని రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్లి.. విమానం ఎలా కూలిపోయిందో స్థానికులనూ, అధికారులనూ అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ.. ఈ ప్రమాదంలో గాయపడిన మెడికల్ విద్యార్థులను పరామర్శించేందుకు సివిల్ ఆస్పత్రికి వెళ్లారు.
ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్రతోపాటూ.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోతూ.. మెడికల్ విద్యార్థులు ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలింది.
దాంతో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. అలాగే.. విమానం నుంచి వచ్చిన మంటల వల్ల హాస్టల్ చుట్టుపక్కల ఇళ్లలో వారు కూడా గాయపడ్డారు.
వారందరికీ సివిల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారి చికిత్సకు పూర్తి ఖర్చులు తామే భరిస్తామని నిన్న ఎయిర్ ఇండియా ప్రకటించింది.
