
టాలీవుడ్ నటి కల్పిక మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. గత నెల (మే) 29న ప్రిజం పబ్లో పుట్టినరోజు సందర్బంగా నటి కల్పిక తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు.
ఈ క్రమంలో కేకు విషయంలో పబ్ సిబ్బంది.. నటి కల్పిక మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో పబ్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా..
బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ (BNS Act) ప్రకారం 324(4), 352, 351(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ప్రిజం పబ్ (Prizm Pub)లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ఆమె ప్రవర్తించారు.
ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతు పురాణాలు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించారంటూ ఫిర్యాదు చేశారు.
