
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం 70 శాతం, కొత్తపేట టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం 30 శాతం పూర్తయింది. వీటిని కూడా ఈ ఏడాది ఆఖరినాటికి పూర్తిచేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తై.. ప్రజలకు అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ రెండో తేదీన ఆస్పత్రిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.