
ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు. టెస్ట్ కెరీర్ విషయంలో హ్యాపీగా ఉన్నానని వివరించాడు విరాట్.పూర్తి కృతజ్ఞతా భావంతో టెస్ట్ టీమ్‌ను వీడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు.ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. ఇది తనను చాలా విధాలుగా మార్చిందని, ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందన్నాడు విరాట్. దీన్ని అంత ఈజీగా మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో ఎమోషనల్ అయిపోయాడు కింగ్.టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహంచని షాక్ ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. 14 ఏళ్లుగా టెస్టుల్లో భారత జట్టుకు ఆడుతూ వచ్చానని.. ఇది తనకు దక్కిన గౌరవమని కోహ్లీ చెప్పాడు.భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అతడి బాటలోనే కోహ్లీ నడుస్తున్నాడని, లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. ఇంకొన్నాళ్లు ఆడాలని, కనీసం ఇంగ్లండ్ సిరీస్ వరకు కంటిన్యూ అవ్వాలని కింగ్‌ను బీసీసీఐ కోరిందని సమాచారం. అయినా ఎవరి మాట వినని కోహ్లీ.. రిటైర్ అవుతున్నట్లు తాజాగా అనౌన్స్ చేశాడు.