

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రిగు ట్టల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసు కుంది. మావోయిస్టు అగ్రనేతలు అక్కడే ఉన్నారని 10 వేల మందికి పైగా భద్రతా బలగాలు గత 20 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్ట్ అగ్ర నాయకుల కోసం భద్రతా బలగాలు అన్వేషణ ప్రారంభించగా వారి ఆచూకీ ఇంకా దొరకలేదని సమాచారం. ఇప్పటికే రెండు కొండలను స్వాధీనం చేసుకున్న సైనికులు త్వరలోనే మూడో కొండనూ స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నారు. గత వారం హెలికాప్టర్ల సాయంతో భద్రతా దళాలను ధోబే కొండలపైకి తరలించారు. అప్పటి నుంచే కర్రిగుట్ట ఆపరేషన్ ప్రారంభమైంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నక్సలైట్ నాయకులు కర్రిగుట్ట కొండల్లో దాక్కు న్నారని.. వారిని పట్టుకుంటే ఆపరేషన్ ముగు స్తుందని సమాచారం.