
పార్లమెంటులో,పహల్గాంలో,పఠాన్కోట్లో,పుల్వామాలో.ఇలా ఎక్కడ పడితే అక్కడ పదే పదే విచక్షణరహిత దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదుల పీచమణచడానికి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారతదేశం వారికి చెందిన 9 కీలక స్థావరాలను గుర్తించింది. నిఘా వర్గాల ద్వారా వాటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి అనూహ్యంగా అర్ధరాత్రి దాడులు చేపట్టి అరగంటలోపే పని ముగించేసింది. పుల్వామాలో నలభై మంది భారతీయ సైనికులను బలిగొన్న జైషే మహమ్మద్ ఉగ్రవాదుల కీలక స్థావరాలు.. సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడి నరమేధం సృష్టించిన అజ్మల్కసబ్కు శిక్షణ ఇచ్చిన ఉగ్ర శిబిరం.. పహల్గాం దాడికి సూత్రధారి అయిన లష్కరేతాయిబాకు చెందిన కీలక క్యాంపులపై క్షిపణులతో విరుచుకుపడింది! పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత్ దాడిలో తునాతునకలైన ఆ తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల్లో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా.. నాలుగు పాకిస్థాన్లో ఉన్నాయి.









1.సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ (పీవోకే)
2.షవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ (పీవోకే)
3.మర్కజ్ తయ్యబా, మురీద్కే (పాకిస్థాన్)
4.మర్కజ్ సుభానల్లా, బహావల్ పూర్ (పాక్)
5.సర్జాల్ తెహ్రా లాంచింగ్ సెంటర్ (పాక్)
6.మర్కజ్ అబ్బాస్, కోట్లీ (పీవోకే)
7.మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా (భింబర్, పీవోకే)
8.మెహమూనా జోయా, సియాల్ కోట్ (పాక్)
9.మస్కర్ రహీల్ షాహీద్, గుల్పూర్ క్యాంప్, కోట్లీ (పీవోకే)