
హుస్నాబాద్ : పదేండ్లలో నియోజకవ ర్గంలోని ఏడు మండలాల్లో 1,237 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు అయితే, 443 మాత్రమే డ బుల్ బెడ్ రూం ఇల్లు లబ్దిదారులకు ఇచ్చారని గుర్తు చేశారు. 227 నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే ఒక్కో నియో జకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఏటా 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. రెండు నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రక్రియ జరుగుతోందని అ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎం పిక ప్రక్రియ సాఫీ గా జరగాలని, ఇల్లు లే ని పేదలను ఎంపిక చేయాలని మంత్రి అధికారు లను ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ఎ లాంటి అవినీతికి తావు లేకుండా ఇళ్ల లబ్దిదారుల ఎంపిక చేయాలని, మొదటి దశలో ఇల్లు రాకపోతే రెండో దశ ఇల్లు వస్తున్నదని, ఇళ్లు కట్టుకునే వారికి అప్పు మహిళా సంఘాల నుంచి లక్ష రూపాయల అప్పు లభిస్తుందన్నారు. అర్హులందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని, సిద్దిపేట జిల్లాలో 47 వేల మంది కొ త్త వ్యక్తులకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇ స్తున్నామని, కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నదని అన్నారు.
ఆడ బిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మి 41 మంది లబ్దిదారులకు చెక్కులు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఉందని మంత్రి పొన్నం అన్నా రు. బుధవారం కోహెడ మండలంలోని రైతు వేదిక లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయ నను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొ న్నం మాట్లాడుతూ పెళ్లిళ్లు జరగడంతోనే అధికారు లకు వివరాలు ఇవ్వగానే కల్యాణ లక్ష్మి, షాదీ ము బారక్ చెక్కులు వెనువెంటనే ప్రభుత్వం రిలీజ్ చే స్తోందన్నారు.