
మునగాకుతో ఈ లాభాలు ఆ పొడిని నీళ్లలో కలిపి మొహం మీద లేదా బాడీకి నల్ల మచ్చలు ఏర్పడినచోట రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి..లేదా ఆకులను కడిగి కొద్దిసేపు నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వలన చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది.
మునగాకు ఇలా తీసుకుంటే షుగర్ తగ్గుతుంది మునగాకులో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మునగాకు తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది.మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే, వారి శరీరంలో 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉపయోగిస్తే చర్మ సంబంధిత వ్యాధులు మాయం యాంటి ఆక్సిడెంట్ లు మునగాకులో ఉండటం వలన చర్మ సంబంధిత వ్యాధుల సమస్యలను అరికడతాయి. చర్మం పై మొహం మీద నల్లమచ్చలు ,మొటిమలు ఏర్పడిన మునగాకుతో నయం చేసుకోవచ్చు . మునగాకు చర్మాన్ని మృదువుగా మరియు తేమగా వుంచుతుంది అయితే మునగాకుని నేరుగా ఉపయోగించకుండా లేత ఆకులను తీసుకొని చల్లటి నీటిలో శుభ్రంగా కడిగి కడిగిన ఆకులను ఎండలో ఎండబెట్టుకొని వాటిని పొడి చేసుకోవాలి.
మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారా? మునగాకుల రసం తాగితే మూత్ర పిండాల సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. మూత్ర పిండాలలో రాళ్ళు ఉండి కడుపులో నొప్పి రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉన్న వారికి మంచి ఉపశమనం కలుగుతుంది.. క్రమం తప్పకుండా ఒక వారం రోజులు తాగితే వారికి మూత్ర పిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.. మునగాకు రసం తాగిన ఒక గంట తరువాత తగిన మోతాదులో చల్లని మంచినీరు తాగాలి. మూత్ర విసర్జనలో రాళ్ళు పోతాయి.
కీళ్ళనొప్పులు ,రేచీకటి సమస్యతో ఇబ్బందా? కీళ్ళ నొప్పులు,రేచీకటి నుండి విముక్తి పొందటానికి మునగాకును పప్పులో వేసుకొని వండుకోవాలి. లేదా మునగాకుతో కూర చేసుకొని తినడం వలన ఎక్కువ పోషకాలు మన బాడీకి లభిస్తాయి. ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు తింటే పైన చెప్పిన వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది.
మునక్కాయలను మనం వివిధ రకాల వంటలలో చేర్చి ఆహారంగా తీసుకుంటాము , అయితే మునక్కాయలే కాకుండా మునగ ఆకులోను అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా మంది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వందల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును ఒక మెడిసిన్ గా కూడా ఉపయోగిస్తున్నారు. మునగాకు లో విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.