
హిట్ 3 టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రం అని ముందు నుంచీ చెప్పిన నాని..
ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ కేవలం తన టార్గెట్ ఆడియన్స్ కోసమే ఈ మూడో కేసుని హింసాత్మకంగా ఛేదించాడు.
నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ ఫ్రాంచైజీలోని గత చిత్రాలు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు.
క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఒక హత్య కేసును చాలా తెలివిగా ఛేదించగలిగే పోలీస్ ఆఫీసర్స్‌గా కనిపించారు
హిట్, హిట్ 2 చిత్రాల్లోని అడవి శేష్, విశ్వక్ సేన్లు. అయితే హిట్ 3తో సొంత ఫ్రాంచైజీలో నిర్మాతగా కాకుండా ఈసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని..
ఈ మూడోకేసు మాత్రం గత చిత్రాల మాదిరిగా ఉండదని ముందు నుంచీ చెప్తూనే ఉన్నాడు. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆదరించే చిత్రాలు కొన్నైతే..
టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రాలు కొన్ని ఉంటాయి.