
జామ పండులో ఫుల్ పోషకాలు జామ పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, కేలరీలు, పొటాషియం, కార్బోహైడ్రేడ్లు, డైటరీ ఫైబర్, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ కారణంగా వీటిని ప్రతి రోజు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ పండు తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
జామపండుతో రక్తపోటుకు చెక్ జామపండులో ఉండే పొటాషియం, సోడియం కారణంగా ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జామ పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జామపండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచేందుకు సహాయపడుతుంది. జామ పండులో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
జామపండుతో ఆరోగ్య ప్రయోజనాలు జామపండు తినటం కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామపండు ఒక అద్భుత ఫలమని చెప్పాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ పండ్లను ప్రతిరోజు తినొచ్చు. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్, అలాగే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కారణంగా ఇది డయాబెటిస్ బాధితులకు ఒక మంచి పండుగా చెప్పొచ్చు.జామపండు మనలను అంటువ్యాధుల బారినుండి కాపాడుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడే జామపండు జామ పండులో ఉండే ఫోలేట్ మన పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలకు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. జామపండు దృష్టిని మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జామపండును రోజుకు ఒకటి తింటే ఎంతో మంచిది. దీనివల్ల మనకు ప్రయోజనమే కానీ నష్టం లేదు.మెదడు పనితీరుకు, చర్మ ఆరోగ్యానికి జామపండు జామపండు నరాలకు పట్టుత్వాన్ని ఇస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జామపండులో విటమిన్ కే, విటమిన్ బి త్రీ పుష్కలంగా ఉండడం వల్ల ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జామ పండులో లైకోపీన్, కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముడతలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది……!