

ఎల్లారెడ్డి : నియోజకవర్గ ఆడబడుచులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు,పలు మహిళా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గ్రామాలను సందర్శించినపుడు, స్థానిక మహిళలు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.దీనికి వెంటనే స్పందించిన మదన్ మోహన్ గారు, తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఈ సమస్య ప్రాధాన్యతతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, సంబంధిత అధికారులు మరియు మంత్రి గారితో చర్చించి, గత ప్రభుత్వంలో ఆగిపోయిన సుమారు ₹1.72 కోట్ల విలువైన 2BHK బిల్లులను విడుదల చేయించి లబ్ధిదారులకు అందజేశారు.గాంధారి & ఎల్లారెడ్డి మండలం గత ప్రభుత్వా పాలకుల అసమర్థత కారణంగా గాంధారి మండలం మేడిపల్లి, గుర్జాల,గుర్జల్ తండా, వెంకటాపూర్ తండా గ్రామాలకు మరియు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్, వెంకటాపూర్, వెల్లుట్ల, కొకొండ గ్రామాలకు చెందిన 2BHK లబ్ధిదారులకు బిల్లులు విడుదల కాక సదరు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆడబడుచులకు అండగా నిలిచిన సందర్భంగా మహిళలు తమ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ, మదన్ మోహన్ గారి తక్షణ స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.