
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ఈనెల 1 నుంచి పంపిణీ చేస్తుండగా.. 30 వరకు లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు.
అయితే కొత్తగా ఆహార భద్రత కార్డులు పొందిన వారికి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.
కొత్త కార్డులు మంజూరయ్యాయన్న సంతోషంతో కార్డుదారులు రేషన్ డీలర్ల వద్దకు వెళ్లగా..
వారందరికీ జూన్ నెల రేషన్ కోటా రాలేదని డీలర్లు తేల్చి చెప్పారు.
అంతేకాదు, జూలై, ఆగస్టు నెలల కోటా కూడా రాదని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక వేలాది మంది కార్డుదారులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.