
ఈ రోజు టెన్త్ పరీక్ష ఫలితాలు వెలువడున్నాయి.
పరీక్షలు చదువులో ఒక భాగం,
చదువు జీవితంలో ఒక భాగం
జీవితమే చదువు కాదు
పరీక్షలే చదువు కాదు ..
అంతేకాకుండా అతి ముఖ్యంగా విద్యార్థి యొక్క జ్ఞానానికి , పరిజ్ఞానానికి పరీక్షలు కొలమానం కాదు, కాకూడదు..
ఒకే విద్యార్థి రాసిన ఒకే జవాబుకి ఒక్కొక్క టీచర్ ఒక్కో రకంగా ప్రతి స్పందించి మూల్యాంకనం చేసి మార్కులు ఇవ్వవచ్చు..
అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది విద్యార్థి ఎంత బాగా రాసిన ఆ ఉపాధ్యాయుడు యొక్క మెదడులో ఆ జవాబు ఏ రకంగా ఉండాలి అని అనుకుంటాడో ఆ రకంగా ఉన్నప్పుడు మార్కులు పడతాయి..
కాబట్టి తల్లిదండ్రులు గురువులు ఈ సమయంలో విద్యార్థులకి బాసటగా నిలవాలి..తోడ్పాటునివ్వాలి..
ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నవించుకునేదేమనగా 🙏🏻
ఫలితాలను మీ పిల్లలని పక్కన కూర్చోబెట్టుకొని చూడండి..
వాళ్ళని ఒంటరిగా ఫలితాల కోసం బయటికి పంపించకండి..
అంతే కాదు ఇంట్లో కూడా ఒక రూమ్ లో కూర్చొని ఒంటరిగా ఫలితాలు చూసే పరిస్థితిని వారికి కల్పించకండి..
మీరు పక్కన కూర్చొని ఫలితాలను చూపించండి..
ఫలితాలు రావడానికి ముందే పిల్లల్ని మానసికంగా సంసిద్దం చేయండి..
ఎన్ని మార్కులు వచ్చినా, నువ్వు పై చదువులు చదవాల్సిందే..
ఆ పై చదువులకి మార్కులు కొలమానం కాదు.
కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు..
నువ్వు నేర్చుకున్న జ్ఞానమైతే ఎక్కడికి పోదు కదా.. అని వారిని సిద్దం చేసి ఉంచండి.
ఒకవేళ 1 లేదా 2 విషయాల్లో ఆగిపోయినా కూడా పెద్ద ప్రమాదమేమీ లేదు..
పది రోజుల్లో మళ్ళీ అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి.
అవి రాస్తావ్, నీ ఫ్రెండ్స్ అందరితో పాటు మళ్ళీ నువ్వు పై చదువులకి వెళ్తావు అని వారిని ప్రోత్సహించేలా మాట్లాడండి..
కానీ దయచేసి ఎక్కడా నిరుత్సాహపరచవద్దు .
ఎందుకంటే ఈ పరీక్ష పోతే మరో పరీక్ష ఉంది కానీ
తప్పుడు నిర్ణయం తీసుకుంటే మరో జీవితం లేదు..
ఇది తల్లిదండ్రులు,విద్యార్థులు, గురువులు అందరూ గుర్తుపెట్టుకోవాలి..
ముఖ్యంగా గురువులకు మా సూచన
అద్భుతమైన మార్కులు వచ్చిన విద్యార్థులను మీరు ప్రోత్సాహం ఇచ్చినా , ఇయ్యకున్నా వాడు సంతోషంగానే ఉంటాడు..
ఎవరైతే ఫెయిలయ్యారో, ఎవరికి అయితే తక్కువ మార్కులు వచ్చాయో వారిని ఒక్కసారి వెళ్లి కలవండి..
నేరుగా కలిసే వీలు లేకపోతే కనీసం ఫోన్ చేసి మాట్లాడండి..
నువ్వు చాలా బాగా చదువుతావ్,
ఎక్కడో ఏదో తప్పు జరిగింది కానీ
అందుకే తక్కువ వచ్చాయి..
ఫెయిల్ అయ్యావు..
అయినా దీనితో పెద్ద నష్టమేమీ లేదు
ఒక పది రోజుల్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి దానికి నేను నీకు మద్దతుగా ఉండాను…
నువ్వు చాలా బాగా చదువుతావు అని మద్దతుగా నిలవండి.
పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వండి..
దయచేసి ఇదంతా తల్లిదండ్రుల, గురువుల యొక్క బాధ్యత
ఇక విద్యార్థులకు చివరగా నా సూచన
పరీక్షలే జీవితానికి కొలమానాలు కాదు.
నీకు ఏ రంగంలో ఇష్టం ఉందో ఆ రంగంలో దృష్టి పెట్టు.
ఖచ్చితంగా విజయం నీ పాదాక్రాంతమవుతుంది..
అంతేగాని పరీక్షల ఫలితాలకు పొంగిపోకు, కృంగిపోకు..
ఫలితం ఏదైనా నీ జ్ఞానం నీతోనే ఉందని గుర్తుపెట్టుకో..
నీ జ్ఞానం నిన్ను ఉన్నత శిఖరాలను అధిరోహింపజేస్తుంది అని మర్చిపోకు..
ఒక వార్డ్ మెంబర్ గా పది సార్లు ఓడిపోయిన అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడుగా గెలిచాడని తెలుసుకో.