
టాప్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి అతిథి పాత్రలో నటించిన “శుభం“. సొంతంగా నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందించారు. మే 9వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ముందుగానే ప్రదర్శించారు.మూవీ మొదలైనప్పటి నుంచి చివరి సన్నివేశం వరకు పుల్లుగా ఎంజాయ్ చేశా. అతి కాకుండా మంచి కంటెంట్‌తో హాస్యాన్ని పండించిన విధానం బాగుంది.శుభం సినిమాతో సమంత నిర్మాతగా అణిముత్యం లాంటి సినిమాను అందించారు.శుభం సినిమా చూసిన తర్వాత చిన్నప్పుడు సందడే సందడి లాంటి మూవీస్ చూసి ఎంజాయ్ చేసినట్టు అనిపిపించింది కేబుల్ టీవీ, డిష్ టీవీ టైమ్ పిరియడ్ కాన్సెప్ట్ బాగుంది. హర్షిత్, చరణ్ బాగా నటించినందుకు కంగ్రాట్స్. మంచి హారర్ కామెడీ సినిమా. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా.సెకండాఫ్‌లో స్టోరీ కొంత పేలవంగా ఉంది. అయినప్పటికీ సినిమా కామెడీ, ఫన్‌తో సాగుతూ ప్రేక్షకులను బాగా నవ్వించేలా చేసింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు బాగా పెర్ఫార్మ్ చేయడం పాజిటివ్ విషయం. అందరూ కూడా మంచి టాలెంట్‌తో పాత్రలను ఎలివేట్ చేశారు.