
తమిళ స్టార్ హీరో సూర్య – పూజా హెగ్దే జంటగా తాజా చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే1న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ ను టీమ్ గట్టిగా నిర్వహించారు. ఈక్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. తన స్టైలిష్ లుక్, స్పీచ్ తో ఆకట్టుకున్నారు. సూర్యపై తన అభిమాన్ని, కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిని విజయ్ దేవరకొండ గుర్తు చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆదివాసీల గురించి మాట్లాడారు.మరోవైపు పలు విషయాల్లోనూ విజయ్ దేవరకొండ పేరు వివాదాస్పందంగా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండపై కేసు నమోదవడం అందరినీ షాక్ కు గురిచేసింది.లాయర్ కిషన్ లాల్ చౌహాన్ విజయ్ దేవరకొండ మీద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై కేసు పెట్టారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా ఉన్న సామాజిక్ రాజకీయ పరిస్థితులను ఆదివాసీలతో పోల్చడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.