
తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన ‘సింగిల్’ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు.హైదరాబాద్‌లో ‘సింగిల్’ సినిమా సక్సెస్ మీట్లో ఈ ప్రకటన చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉంటూ, దేశ రక్షణ కోసం పోరాడుతున్న సమయంలో తాము సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కాదని భావించినట్లు ఆయన తెలిపారు. కేవలం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో,నిర్మాత అల్లు అరవింద్ భారత సైనిక దళాలకు తమ మద్దతును ప్రకటించారు.