

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు.
టేకాఫ్ అయిన 38 సెకన్లలో అది పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది.
అయితే అదే విమానంలో బతికి బయటపడిన రమేష్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని మీడియాకు వివరించారు.
నా సీటు నెంబర్ 11ఏ. గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజీ భవనం ఢీకొట్టింది.
వెంటనే నేను చనిపోయానని అనుకున్నా. కానీ అలా జరగలేదు. బతికే ఉన్నానని గ్రహించిన నేను ఫ్యూజ్‌లేజ్‌లో ఓ రంధ్రం కనిపించింది.
నేను కూర్చున్న సీటు బెల్ట్ వెంటనే అన్‌లాక్ చేసి, ఆ రంధ్రంను కాలితోతన్ని అందులో నుంచి బయటకు దూకేశాను. అయితే అది ఎమర్జెన్సీ తలుపా లేదంటే విమానం ఫ్యూజ్‌లేజ్‌లో పగిలిన భాగమా అనేది స్పష్టంగా తెలియదు.
నా కళ్ల ముందే అంతా క్షణాలలో జరిగిపోయింది. నేను ఎలా బతికానో నమ్మలేకపోతున్నాను. కొన్ని క్షణాలపాటు నేను చనిపోతున్నాననే భావించాను. కళ్లు తెరచి చూస్తూ నా చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
నేను బతికే ఉన్నాని తెలుసుకుని అక్కడి నుంచి నడుకుంటూ బయటకు వచ్చాను.. అని రమేష్ తెలిపాడు.