
గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్పైన ఈటల రాజేందర్ తన పరిధిని దాటి మాట్లాడాడని, అందుకే తానూ పరిధిని దాటి సమాధానం ఇస్తున్నానన్నారు.
నియోజకవర్గ సమస్యలపైన సీఎం రేవంత్‌రెడ్డిని ఈటల ఏనాడైనా కలిశారా అంటూ నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కావాలని కలలు కన్న ఈటల రాజేందర్‌కు అవి రాకపోయే సరికి సైకోలాగా మారాడన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడిరోడ్డుపై గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు.
పార్టీలో పదవి కోసమే సీఎం రేవంత్‌ను తిడుతున్నాడని పేర్కొన్నారు. ‘‘ఏదైనా విషయం ఉంటే సీఎంను ప్రశ్నించు.. డిమాండ్ చేయి! అంతే కానీ.. సీఎంను పట్టుకుని కొడకా అంటావేంటిరా? ఏం భాషరా అది? సీనియర్ నాయకుడు.. బాధ్యత గల ఎంపీ లెక్క నీ మాటలు లేవు.నిన్ను అనలేమా.. కొడకా అని? మేము తిట్టడం మొదలెడితే ఉరేసుకుని చస్తవు!’’ అంటూ ఈటలపై ఫైర్ అయ్యారు….ఈటల.. పార్లమెంటరీ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం ఇస్తామని చెప్పారు. బూతులు మాట్లాడితే బూతులతోనే సమాధానం చెబుతామన్నారు.ఇంకోసారి సీఎం రేవంత్, కాంగ్రెస్ జోలికి వస్తే మొరటుగాను సమాధానం ఇస్తామని జగ్గారెడ్డి అన్నారు.