
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం చక్కెర తినడం మానేసిన వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. చక్కెర తీసుకోవడం ఆపేస్తే చర్మం కూడా మరమ్మత్తులకు గురవుతుంది. చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా రక్షించబడతాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన ఉండవు. లివర్లో ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది. మీరు తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఇలా చక్కెర తినడం మానేసిన 30 రోజులకు మీ శరీరంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. . ముఖ్యంగా శరీరంలోని కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. చక్కెర తీసుకోవడం మానేస్తే కొందరికి విసుగు వస్తుంది. ప్రతి విషయానికి చికాకు పడుతుంటారు. ఏకాగ్రత లోపిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గినట్లు ఫీలవుతారు. వికారంగా కూడా అనిపిస్తుంది. నిద్ర పట్టదు. ఆందోళన కూడా ఉంటుంది. ఇవన్నీ చక్కెర మానేసిన ఆరంభంలో కనిపించే లక్షణాలు. వీటన్నింటినీ తట్టుకుని స్థిమితంగా ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.కనుక చక్కెరను ఈ దశలో ఎంత వీలైతే అంత వరకు నియంత్రించాల్సిందే. అప్పుడే పాజిటివ్ ఫలితాలు వస్తాయి. తరువాత కొందరికి తలనొప్పి కూడా వస్తుంది. తీపి తినలేకపోతున్నామనే ఆందోళన కారణంగా వచ్చే ఒత్తిడి అది. అందుకనే తలనొప్పి వస్తుంది. కనుక ఇలా జరిగినా కూడా విచారించకూడదు. అలాగే చక్కెర తీసుకోవడం మానేసిన వారిలో అలసట, శక్తి స్థాయిలు తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది కూడా మామూలు విషయమే అని వైద్య నిపుణులు అంటున్నారు.