
రాష్ట్రంలో రేషన్ బియ్యం కోటా కూడా తగినట్లుగానే పెరిగింది. జనవరిలో 1.79 లక్షల టన్నులు గా ఉన్న బియ్యం కోటా, మే నెల నాటికి 1.86 లక్షల టన్నులకు చేరింది. కొత్త లబ్ధిదారుల అవస రాల కోసం అదనంగా 4,431 టన్నుల బియ్యాన్ని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో పాత కార్డుల్లో కొత్తగా చేర్పులు.. తొలిగింపుల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లబ్ది దారుల నుంచి దరఖాస్తుల మేరకు జనవరి నుంచి మే మధ్యలో ప్రభుత్వం 19 లక్షలకు పైగా లబ్ధిదారులను కొత్తగా గుర్తించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల 7 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్నవాళ్లు వివాహం తర్వాత వేరుగా ఉండటంతో కార్డుల్లో మార్పులు జరిగాయి. చివరికి నికరంగా 12 లక్షల మందికి కొత్తగా రేషన్ అందనుంది. ఇక..ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా మూడు లక్షల దాకా పెండింగ్లో ఉన్నాయి. అధికారులు వాటిని దశలవారీగా పరిశీలించి కొత్తగా చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది.
అదే విధంగా కొత్తగా రేషన్ లబ్ది దారులకు సన్న బియ్యం పంపిణీ మొదలైంది. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త రేషన్ కార్డుల జారీ పైన స్పష్టత ఇచ్చింది. ఎంతో కాలంగా కార్డుల్లో పేర్లు మార్పు.. కొత్తగా చేర్పుల పైన లబ్ది దారులు వేచి చూస్తున్నారు. ఈ అంశం పైన పౌర సరఫరాల శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసు కున్న వారికి కొత్త కార్డుల జారీ పైన స్పష్టత ఇచ్చింది