
తెలుగు సినీపరిశ్రమలో డైరెక్టర్ వెంకీ అట్లూరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఎక్కువగా తమిళ్, మలయాళం హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తన సినిమా ప్లానింగ్స్, తెలుగు స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తాను నాగచైతన్యతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకీ మాట్లాడుతూ.. తాను రాసుకున్న ప్రతీ కథను ముందుగా అక్కినేని నాగచైతన్యకే చెబుతానని అన్నారు. ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాను ఆయనకే నేరేట్ చేసినట్లు తెలిపారు. “నేను ఇప్పటివరకూ రాసుకున్న ప్రతీ కథ చైతన్యకే చెప్పాను.. నేను తీసిన 5 సినిమాలు ప్రతీది మొదట ఆయనకే చెప్పాను. ప్రతిసారి డేట్స్ కుదరకపోవడమో.. ఏదొక కారణంతో మా ఇద్దరి కాంబో సెట్ కాలేదు.