
ఇందిరమ్మ ఇళ్ల పథకం బాధ్యతలను జిల్లాల వారీగా కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఐటీడీఏల పరిధిలో మాత్రం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల (పీవో)కు అప్పగించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు జ్యోతిబుద్ధ ప్రకాశ్, వీపీ గౌతమ్‌లతో సమావేశమైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఐటీడీఏ పరిధిలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఐటీడీఏ పీవోలకు పంపి అర్హులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.